
నిషేధిత గడ్డి మందు పట్టివేత
వాంకిడి: మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గడ్డి మందును పోలీసులు శ నివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో మండలంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద వ్యవసాయాధికారులతో కలిసి వాహనాల త నిఖీ చేపట్టారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి న కారు తనిఖీ చేయగా హైజాక్, రౌండప్, క్లింటన్ పేర్లతోగల 243 లీటర్ల నిషేధిత ద్రావణపు గడ్డి మందు, టాపర్ పేరిట గల 120కి లోల పొడి గడ్డిమందు లభ్యం కాగా, విలువ రూ.1,48,390 ఉంటుంది. గడ్డిమందు తరలి స్తున్న ఇద్దరిరిని, కారును అదుపులోకి తీసుకు ని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.