వందేభారత్‌కు హాల్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

వందేభారత్‌కు హాల్టింగ్‌

Aug 31 2025 7:56 AM | Updated on Aug 31 2025 7:56 AM

వందేభ

వందేభారత్‌కు హాల్టింగ్‌

మంచిర్యాల, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో నిలుపుదల నాగ్‌పూర్‌–సికింద్రాబాద్‌ మధ్య రైలు ప్రయాణం ఏడాదిగా ఇస్తున్న వినతులకు స్పందించిన రైల్వే

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సికింద్రాబాద్‌–నాగ్‌పూ ర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎట్టకేలకు మంచిర్యాల, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్లలో నిలుపుదలకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ఏడాదిగా మంచిర్యాల, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌తోపాటు బెల్లంపల్లి రైల్వేస్టేషన్లలోనూ హాల్టింగ్‌ ఇవ్వాలని కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల వాసులు వినతిపత్రాలు ఇస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి, ఆదిలాబా ద్‌ ఎంపీలు, సిర్పూర్‌ ఎమ్మెల్యేతో సహా బీజేపీ నా యకులు, స్థానిక నాయకులు, ఉత్తర తెలంగాణ రై ల్వే ఫోరం ప్రతినిధులు అనేకసార్లు ఉన్నతాధికారులను కలిసి హాల్టింగ్‌ ఇవ్వాలని కోరారు. ఇక్కడి ప్ర యాణికుల డిమాండ్లపై ‘సాక్షి’లోనూ పలుసార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో నిలుపుదలకు రైల్వే బోర్డు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ప్రయోగాత్మకంగా హాల్టింగ్‌ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండు స్టేషన్లలోని టికెట్ల ఆదాయం పరి గణనలోకి తీసుకుని పొడిగింపు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇంకా ఏ రోజు నుంచి రైలును ని లుపుదల చేస్తారనే తేదీని ప్రకటించలేదు. కొద్ది రో జుల్లోనే రైలును నిలిపే అవకాశాలున్నాయి.

రైలు ఆగక, ఆదాయం లేక..

భారత రైల్వేలో ఆధునిక వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తున్న వందేభారత్‌ రైళ్లు ఎంపిక చేసిన మార్గాల్లో నడుస్తున్నాయి. గతేడాది సె ప్టెంబర్‌ 16న సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ మధ్య అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్‌, కాజిపేట, రామగుండం స్టాప్‌లు ఇచ్చి తర్వాత నేరుగా మహా రాష్ట్రలో బల్లార్షా, చంద్రాపూర్‌, సేవాగ్రామ్‌, నాగ్‌పూర్‌కు చేరుకుంటుంది. మొదట ఆరెంజ్‌ రంగులో 20కోచ్‌లతో నడిచింది. ఈ మార్గంలో ప్రయాణికు ల ఆదరణ లేక ఆదాయం తగ్గిపోయింది. ఈ రైలు మొత్తం సీట్లలో 40శాతంలోపే ప్రయాణికులతో న డుస్తోంది. దీంతో 8కోచ్‌లకు కుదించి రైలును తెల్ల రంగులోకి మార్చారు. మరోవైపు ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో 8 స్టేషన్ల పరిధిలో ఎక్కడా స్టాప్‌లు ఇవ్వకపోవడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర నిరాశ కు గురయ్యారు. తాజా ఉత్తర్వులతో ఈ రెండు జి ల్లాల నుంచి ఉదయం పూట వెళ్లే మార్గంలో కాజి పేట, సికింద్రాబాద్‌ వరకు వెళ్లొచ్చు. అలాగే తిరుగు ప్రయాణంలో సాయంత్రం నాగ్‌పూర్‌ వైపు సికింద్రాబాద్‌ నుంచి మంచిర్యాల, కాగజ్‌నగర్‌తోపాటు బల్లార్షా, చంద్రాపూర్‌, నాగ్‌పూర్‌ వరకు ఈ రెండు జిల్లాల ప్రయాణికులకు వీలు కలుగుతుంది. సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు వేగంగా వెళ్లే అవకాశం ఉండడంతో వందేభారత్‌ రైలును ఈ రెండు స్టేషన్లలో ఆపాలనే డిమాండ్లు వచ్చాయి.

ఫలించిన వినతులు

సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ మధ్య నడిచే గోరఖ్‌పూర్‌, తెలంగాణ, హజ్రత్‌ నిజాముద్దీన్‌, జమ్ముతావి, దానాపూర్‌, సూపర్‌ ఫాస్ట్‌తోపాటు పలు రైళ్లు అరగంట అటు ఇటుగా అన్నీ 7గంటల నుంచి 8గంటల మధ్య ప్రయాణ సమయం పడుతోంది. ఇదే త రహాలో వందేభారత్‌ ఏడున్నర గంటలు పడుతోంది. అయితే మంచిర్యాల, బెల్లంపల్లి తదితర చోట్ల స్టాప్‌లు లేకపోగా, ప్రయాణికులతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రెళ్లు కిక్కిరిసి ఉంటున్నా యి. రిజర్వేషన్లు కూడా దొరకని పరిస్థితి. వందేభారత్‌కు టికెట్‌ ధర అధికం కావడం, సౌకర్యాలు అధికంగా ఉండడం, స్టాప్‌లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులకు సుఖవంతంగా ప్రయాణం ఉంటుంది. దీంతో వందేభారత్‌ రైలు ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల పరిధిలో నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ప్రయాణికుల వినతుల మేరకు రైల్వే శాఖ ఆమోదం లభించింది.

సాక్షిలో ప్రచురించిన కథనం

వందేభారత్‌కు హాల్టింగ్‌1
1/1

వందేభారత్‌కు హాల్టింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement