
అంగన్‌వాడీల్లో అల్పాహారం
తిర్యాణి: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒకపూట సంపూర్ణ పోషకాహారం అందిస్తోంది. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తోంది. కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. కేంద్రాల్లో మరో కొత్త పథకం అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఒకపూట (మధ్యాహ్నం) మాత్రమే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుండగా అదనంగా ఉదయం పూట అల్పాహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వా రం క్రితం మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌లో సంబంధిత శాఖ అధికారులతో స మీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగ ర పరిధిలోని 139 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. అక్కడ మెరుగైన ఫలితాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఏజెన్సీల్లో ఎంతో ఉపయోగం
జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ సెక్టార్ల పరిధిలో 973 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 3–6 ఏళ్ల లోపు 22,817 మంది చిన్నారులు ఆటపాటలతో కూడిన విద్యను అభ్యసిస్తున్నారు. కాగా, చిన్నారుల హాజ రు పూర్తి స్థాయిలో నమోదు కావడం లేదు. హాజరుశాతం సగటున 72 శాతం నమోదవుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గాను అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. నూ తనంగా అందించనున్న అల్పాహారం ద్వారా చిన్నారులు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపే అవకాశముంది. తద్వారా హాజరు శాతం పెరగడంతో పా టుగా వారి శారీరక పెరుగుదల (ఆరోగ్యం) కూడా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ పథకం జిల్లాలోని వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్నారులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది. జిల్లాలో 973 కేంద్రాలుండగా 352 కేంద్రాలకే సొంత భవనాలున్నాయి. 296 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగతా 325 కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు ఒక్కోదానికి రూ.12లక్షలు మంజూరు చేయనున్నట్లు మంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు.
ఇంకా ఉత్తర్వులు అందలేదు
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందించే విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొన్ని కేంద్రాల్లో ప్రభుత్వం ప్ర యోగాత్మకంగా పథకం నిర్వహిస్తోంది. జిల్లాలో నూ అమలైతే ఎంతో బాగుంటుంది.
– భాస్కర్, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి