
అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
పెంచికల్‌పేట్: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. శనివారం పెంచికల్‌పేట్ గ్రామంలో పర్యటించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తంజేశా రు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంత రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయించి లబ్ధిదారుల కు సకాలంలో బిల్లులు అందించేలా చొరవ చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ భవనం, పాఠశాలలో మూత్రశాలలు, కిచె న్ షెడ్, డ్రైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చే యాలని గ్రామస్తులు అడిషనల్ కలెక్టర్‌ను ఈ సందర్భంగా కోరారు. త్వరగా కూలి చెల్లించేలా చూడాలని ఉపాధిహామీ కూలీలు ఆయనకు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అదనపు కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. ఆయన వెంట క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంపీడీవో అల్బర్ట్, ఏఈ సందీప్, హెచ్‌ఎం యాదగిరి, ఉపాధ్యాయురాలు ప్రియాంక తదితరులున్నారు.
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
దహెగాం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజ రుశాతం పెంచాలని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్న త పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. హాజరు రిజిష్టర్లు పరిశీలించి పలువురు పదో తరగతి విద్యార్థులు దీర్ఘకాలికంగా ఎందుకు గైర్హాజరవుతున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరో జూ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి డిజిటల్ తరగతులను వీక్షించారు. బోధన తీరును విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. వంట గదుల కోసం ప్రతిపాదనలు అందించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో రాజేందర్, ఎంఈవో శ్రీనివాస్ ఉన్నారు.