
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్
కాగజ్‌నగర్ టౌన్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃరుద్ధరించాలని టీజీ ఈజేఏసీ జిల్లా చైర్మన్ జయదేవ్ అబ్రహం డిమాండ్ చేశారు. శనివా రం కాగజ్‌నగర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనంలో టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ వి ద్రోహ దినం, పాత పెన్షన్ సాధన పోరాట సభ పో స్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక పిలుపు మేరకు సెప్టెంబర్ 1న కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో పెన్షన్ సాధన పో రాట సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరా రు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం పునఃరుద్ధరణ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రావు, శాంతికుమారి, శివప్రసాద్, న ర్సయ్య, లింగమ్మ, నర్సయ్య, మురళీధర్‌రావు, పు రుషోత్తం, రాజ్‌కమలాకర్‌రెడ్డి, మహిపాల్, మహే శ్, ఉదయ్‌కుమార్, విస్తారు పాల్గొన్నారు.
‘రద్దు చేసేదాకా పోరాడుతాం’
రెబ్బెన: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుకు వి ఘాతంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసే వరకు పోరాడుతామని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజ శేఖర్ తెలిపారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని నిర్వహించాలని తెలిపా రు. కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు జి ల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు అధికసంఖ్య లో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సంఘం నాయకులు మేడి చరణ్‌దాస్, దూడ రాజనర్సుబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.