కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలంలోని అందవెల్లి పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికా రులు చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం సబ్ కలెక్టర్ శ్రద్ధాశు క్లా ఇసుక అక్రమ రవాణా చేసే ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశారు. అయినప్పటికీ అనుమతి లేకుండా ట్రాక్టర్ల యజమానులు యథావిధిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ యజమానులకు బడా నాయకుల అండదండలు ఉండడంతో యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతోందనే ఆరోపణలు న్నా యి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసు క అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.