
పనిభారం తగ్గించాలని వీవోఏల ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: పనిభారం తగ్గించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవా రం ఐకేపీ వీవోఏలు ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ ఐకేపీ వెలుగులో క్షేత్రస్థాయిలో గ్రామ సమైఖ్య సంఘం అసిస్టెంట్లతో 67 రకాల పనులు చేయించుకుంటున్నారని తెలి పారు. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నా వారికి ఉద్యోగ భద్రత లేదన్నారు. విద్య భోదన, ట్రైనింగ్ పేరుతో ఇబ్బంది పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరారు. అనంతరం డీఆర్‌డీఏ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షులు రోజా, కార్యదర్శి ధనరాజ్, నాయకులు అన్నపూర్ణ, అంకన్న, వనిత, సుమలత, వెంకటేశ్, సంతోష్, భరత్, హనుమంత్‌రావు, తిరుపతి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.