
ఘనంగా మాజీ మంత్రి భీంరావు వర్ధంతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి దివంగత కోట్నాక భీంరావు 23వ వర్ధంతిని శుక్రవారం జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్స్ పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. భీంరావు విగ్రహానికి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, అధికారులు, గిరిజన సంఘా ల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా భీంరావు అందించిన సే వలు చిరస్మరణీయమన్నారు. గిరిజన యువ త ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, వివిధ రాజకీయ పార్టీలు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.