
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
ఆసిఫాబాద్‌రూరల్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అలింకో సంస్థ ద్వారా జిల్లాలో కృత్రిమ అవయవాలు, సహాయ ఉపకరణాలు అందించేందుకు 108 బాలబాలికలను ఎంపిక చేశామని తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్‌బాబు, జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టి
జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధిపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కౌటాల, రెబ్బెన, కెరమెరి మండల్లోని కేంద్రాలు శిథిలావస్థకు చేరాయని, వాటిని ఇతర భవనాల్లోకి మార్చాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి సరిత తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు, ఏపీవోలు, ఏపీఎంలు, హౌజింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలతో పాఠశాలలు, పీహెచ్‌సీలు, ఉప కేంద్రాలు దెబ్బతిన్నాయని, వాటి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌజింగ్ పీడీ వేణుగోపాల్, డీటీడీవో రమాదేవి పాల్గొన్నారు.