
మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మల్టీపర్పస్ విధానాన్ని తక్షణ మే రద్దు చేయాలని, కార్మికులకు గ్రీన్ చానల్ ద్వా రా వేతనాలు చెల్లించాలని గ్రామ పంచాయతీ కా ర్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు మోరేశ్వర్, కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు నిత్యం పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఇతర ప్ర భుత్వ పథకాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. 2019 లో వచ్చిన మల్టీపర్పస్ విధానంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా వేతనాలు కూడా అందడం లేదన్నారు. సీఎం హామీ ఇచ్చినా కనీస వేతనాలు అమలు కావ డం లేదన్నారు. జీవో 51 సవరించాలని డిమాండ్ చేశారు. డీపీవో కార్యాలయంలో వినతి పత్రం అందించారు. నాయకులు, కార్మికులు అనిల్, వసంత్, నగేష్, విలాస్, సంతోష్, రాజు పాల్గొన్నారు.