
వరదలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి
కెరమెరి(ఆసిఫాబాద్): వరదలు తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని మెట్టపిప్రి, సాంగ్వి గ్రామాలను గురువారం సందర్శించి వరద పరిస్థితులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల రక్షణకు చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. వరదల నేపథ్యంలో కల్వర్టులను పరిశీలించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అంజద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.