
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ, కేవీపీఎస్ నాయకులు గురువారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌వో సీతారాంకు వినతిపత్రం అందించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దినకర్ మాట్లాడుతూ జిల్లాలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో రెండు ఆస్పత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేశారన్నారు.