
లంబోదరాయ నమః
జిల్లా కేంద్రంలోని వాసవీ గణేశ్ మండలి వద్ద భక్తులు
మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ద్వారకానగర్ కాలనీలో లడ్డూ వినాయకుడు
వినాయకుడిని దర్శించుకుంటున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్/రెబ్బెన/కాగజ్‌నగర్‌టౌన్: వినాయక చవితి సందర్భంగా జిల్లావ్యాప్తంగా బుధవారం గణనాథుడు కొలువుదీరాడు. వివిధ రకాల పూలు, పత్రితో భక్తులు వినాయకుడికి పూజలు నిర్వహించి, పాయసం నైవేద్యంగా సమర్పించారు. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయాలు, మండపాలను భారీ సెట్టింగులు, కలర్‌ఫుల్ లైటింగ్‌తో అలంకరించారు. వివిధ రకాల రూపాలతో లంబోదరుడు ఆకట్టుకున్నాడు. పలువురు భక్తులు మట్టితో చేసిన బొజ్జ గణపయ్యను ఇళ్లలోనే ప్రతిష్టించుకున్నారు. జిల్లాకేంద్రంలోని వాసవీ మందిరంలో అర్చకులు ఇందారపు మధూకర శర్మ శమంతకమనోపాఖ్యాణం చేశారు. వివేకానందచౌక్‌లో వాసవీక్లబ్, పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. రెబ్బెన మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో ప్రతిష్టించిన వినాయకుడిని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, తహసీల్దార్ సూర్యప్రకాశ్ తదితరులు దర్శించుకుని పూజలు చేశారు.
‘లడ్డూ’ లంబోదరుడు
కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో దశాబ్దాలుగా ఏకో ఫ్రెండ్లీ గణేశుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది యువజన గణేశ్ మండలి ఆధ్వర్యంలో 15 రోజుల కష్టపడి 14 అడుగుల లడ్డూ వినాయకుడిని ప్రతిష్టించారు. కాలనీలో 50 ఏళ్లుగా గణనాథుడికి ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తుండగా, 1999 నుంచి పర్యావరణ హితంగా ఏకో ఫ్రెండ్లీ విగ్రహం తయారు చేస్తున్నారు. కొబ్బరికాయలతోపాటు స్టీల్ సామగ్రి, కూల్‌డ్రింక్స్ బాటిళ్లు, కూరగాయలు, వరి పేలాలు, పూలు, శివలింగాలు, రుద్రాక్ష, కొబ్బరి కుడుకలు, వెదురు గంపలు, మట్టి దీపం చిప్పలు, పత్తి, మోసంబి, రాగి వస్తువులు, పేపర్ గ్లాసులు, మక్కలు, కొబ్బరి మట్టలు తదితర వస్తువులను వినియోగిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది బుందీ లడ్డూతో ఏర్పాటు చేసిన పార్వతి తనయుడు చూపరులను ఆకట్టుకుంటోంది. మూడు వేల బూంది లడ్డూలు వినియోగించి గణనాథుడిని ఏర్పాటు చేశామని యువజన గణేష్ మండలి అధ్యక్షుడు ములుగూరి నరసింహ తెలిపారు.
కాగజ్‌నగర్‌లోని ఇందిరా మార్కెట్ ఏరియాలో కొలువుదీరిన గణనాథుడు

లంబోదరాయ నమః

లంబోదరాయ నమః

లంబోదరాయ నమః

లంబోదరాయ నమః