
కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం ఆర్జించిన వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. లాభాల్లో వాటా, ఇతర హక్కుల సాధనలో భాగంగా గురువారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏరియాలోని అన్ని గనులు, డిపార్టుమెంట్లలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించారు. ఆయన మా ట్లాడుతూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రభు త్వ సంఘం ఐఎన్‌టీయూసీ హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నాయని అన్నారు. డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2న కొత్తగూడెంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, ఫిట్ కార్యదర్శులు రమేశ్, వెంకటేశ్, శ్రీని వాస్, రవీందర్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సురేశ్, నాయకులు సాగర్, సమ్మయ్య, కరీముల్లాఖాన్, భిక్షపతి, సత్యనారాయణ, వరలక్ష్మి పాల్గొన్నారు.