
‘రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం’
కాగజ్‌నగర్‌టౌన్/బెజ్జూర్: రాష్ట్రంలో యూరియా కోసం అవస్థలు పడుతుంటే, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బుధవారం సిర్పూర్(టి) మండలంలోని ప లు గ్రామాల్లో పర్యటించారు. గురువారం బెజ్జూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎంకు రైతుల కంటే బిహార్ ఎన్నికలే ముఖ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ల బ్లాక్ దందాలే యూరియా కొరతకు కారణమన్నారు. రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్ ఉండటంతో యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫి కెట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించా రు. ఆయా కార్యక్రమాల్లో నియోజకవర్గ కన్వీనర్ శ్యాంరావు, నాయకులు విశ్వనాథ్, అర్షద్ హుస్సేన్, సారయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.