
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తు న్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం జూని యర్ అసిస్టెంట్ కార్తీక్‌కు సమ్మె నోటీసు అందించారు. ఆయన మాట్లాడుతూ సిర్పూర్(టి), తిర్యాణి, కాగజ్‌నగర్, వాంకిడి మండలాల్లోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. 2022 నుంచి ఈపీఎఫ్ పూర్తి వివరాలను అందించాలని, ఈఎస్‌ఐ, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1 తర్వాత సమ్మెలోకి వెళ్తామని తెలిపారు. అనంతరం కాగజ్‌నగర్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు చిరంజీవి, కార్మికులు తుకారం, తిరుపతి, మారుతి, దేవిరావు, పరమేశ్వర్, సిబ్బంది ఉన్నారు.