
ప్రభుత్వం ఆదుకోవాలి
ఈ ఏడాది పత్తి పంట మంచిగనే ఉండే. వానలకు వరద వచ్చింది. నాకున్న మూడెకరాల్లో పత్తి పంట కొట్టుకుపోయింది. పెట్టిన పెట్టుబడంతా వరద పాలైంది. ఏం చేయాలో అర్థమైతలేదు. అప్పులు ఎట్ల తీర్చుడో..? ఏటా వరదలకు నష్టపోతున్నం. ప్రభుత్వం మాకు ఎకరానికి రూ.20 వేలు ఇచ్చి ఆదుకోవాలి.
– జునుగరి సత్తన్న, రైతు
సర్వే కొనసాగుతోంది
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 6,453 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రస్తుతం మండలాల్లో పంట నష్టం సర్వే కొనసాగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం. క్షేత్రస్థాయికి వెళ్లి సమగ్రంగా సర్వే చేపట్టాలని మండల వ్యవసాయాధికారులకు సూచించాం.
– శ్రీనివాసరావు,
జిల్లా వ్యవసాయాధికారి