
మట్టి వినాయకుడిని పూజించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): పర్యావరణ పరిరక్షణ కు ప్రతిఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాల ను పూజించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి డిస్పెన్సరీ వద్ద మంగళవా రం ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. జీఎం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి ఆధ్వర్యంలో ఏటా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పీవోపీతో తయారు చేసే విగ్రహాల వినియోగం తగ్గించాలని సూచించారు. రసాయనాలతో నీటిలోని జీవజాతులకు హాని కలుగుతోందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఎస్‌వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, ఏరియా పర్యావరణ అధికారి హరీశ్, ఉద్యోగులు పాల్గొన్నారు.