
చీఫ్ రెఫరీగా వెంకట రామకృష్ణ
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణ స్టేట్ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ రెఫరీగా రెబ్బెన మండలం గో లేటికి చెందిన రిక్కల వెంకట రామకృష్ణ ని యమితులయ్యారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో జరి గిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో రామకృష్ణను చీఫ్ రెఫరీగా ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బంగారు స్వామి, వీవీ రమణ మంగళవారం తెలిపారు. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్‌బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆర్‌వీ రామకృష్ణను ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి, బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడు భాస్కర్, సెపక్ తక్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అభినందించారు.