
పూలాజీబాబా జయంతి ఘనంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జైనూర్ మండలం పాట్నాపూర్‌లో ఈ నెల 30న పూలాజీ బాబా జయంతి ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పాట్నాపూర్‌లోని పూలాజీ బాబా సంస్థాన్‌లో జయంతి వేడుకల నిర్వహణపై అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంస్థాన్ వద్ద వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్ శాఖ అధికారులు రూట్‌మ్యాప్ తయారు చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తాగునీటికోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూర్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. జాతరలో వైద్య శిబిరాలు ఏర్పా టు చేసి అందుబాటులో ఉండాలన్నారు. భోజన వసతి వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ప్రముఖుల కోసం బారికేడ్లు ఏర్పాటు చే యాలని సూచించారు. అనంతరం జయంతి పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాథోడ్ శేషారావు, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్‌వో సీతా రాం, మిషన్ భగీరథ ఈఈ సిద్దిఖి, సీఐ బాలాజీ వరప్రసాద్ పాల్గొన్నారు.
పారదర్శకంగా పింఛన్లు పంపిణీ
పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్‌లో అదనపు కలెక్టర్ దీపక్‌తివారితో కలిసి బ్రాంచ్‌పోస్టల్ ఆఫీసర్ల(బీపీఎం)లకు మొబై ల్స్ అందించారు. మొబైల్‌లో ప్రత్యేక యాప్‌లో పెన్షన్‌దారులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని తెలిపారు. ప్రతినెలా ఐరిష్, వేలిముద్రల ద్వారా పెన్షన్ అందించనున్నట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.