
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్: విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లోనవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఖాన్ అకాడమీ తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం, వంట సామగ్రిని పరిశీలించారు. అనంతరం లోనవెల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల వివరాలు పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో వేణుగోపాల్, లోనవెల్లి పీహెచ్‌సీ వైద్యురాలు నవత, సిబ్బంది ఉన్నారు.