
ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని ధర్నా
ఆసిఫాబాద్‌అర్బన్: ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు చెల్లించి, ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆశవర్కర్లు సోమవా రం ధర్నా చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆశవర్కర్లు సమస్యలతో సతమతం అవుతున్నారన్నా రు. 20 ఏళ్లుగా ఎన్‌హెచ్‌ఎం స్కీమ్‌లో అహర్నిశలు శ్రమిస్తున్నా పారితోషకం తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచించడం అన్యాయమన్నారు. యథావిధిగా ప్రతినెలా వేతనం ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఆరోగ్యశాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఇన్సూరెన్స్ కింద రూ.50 లక్షలు చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, రిటైర్మెంట్ బెన్‌ఫిట్‌గా రూ.5లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, నాయకులు స్వరూప, భారతి, లక్ష్మి, పంచశీల, వని త, నవీన, శ్రీలత, అనిత, కవిత, నిర్మల, ముంజం శ్రీనివాస్, త్రివేణి, కృష్ణమాచారి, సమ్మయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.