
స్టేట్ సెలక్షన్ కమిటీలో చోటు
రెబ్బెన(ఆసిఫాబాద్): తెలంగాణ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీలో జిల్లా సీనియర్ క్రీడాకారులకు చోటు దక్కింది. సబ్ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా రెబ్బెన మండలం గోలేటికి చెందిన మారిన వెంకటేశ్వర్లు, జూనియర్స్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా గోలేటి విలేజ్‌కు చెందిన లావుడ్య హరిలాల్, టోర్నమెంట్ కమిటీ చైర్మన్‌గా సింగరేణి ఉన్నత పాఠశాల పీఈటీ భాస్కర్ ఎంపికయ్యారు. గోలేటి టౌన్‌షిప్‌లో ఆదివారం జరిగిన తెలంగాణ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో జిల్లావాసులకు సెలక్షన్ కమిటీ, టోర్నమెంట్ కమిటీలో ప్రాధాన్యత కల్పించారు. ఎంపికై న వారు జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, కార్యదర్శి ఎస్.తిరుపతి, చీఫ్ ప్యాట్రన్ ఆర్.నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కె.భాస్కర్
మారిన వెంకటేశ్వర్లు

స్టేట్ సెలక్షన్ కమిటీలో చోటు