
ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే యూరియా కొరత ఏర్పడుతుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రైతులకు సరి పడా యూరియా అందించడం లేదని జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కా ర్యాలయం ఎదుట సోమవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డికి వారికి బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిల్వలు లే వని చేతులెత్తేసిందన్నారు. యూరియా కొరతకు బా ధ్యత వహిస్తూ సీఎంతోపాటు ఇతర మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకురాలు సరస్వతి, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, నాయకులు రవీందర్, అహ్మద్, బలరాం, నిస్సార్, లక్ష్మణ్, భీమేష్, రాజ్‌కుమార్, శ్రీకాంత్, శ్రీను, రవి, కిష్టయ్య, పెంటు, పోచన్న పాల్గొన్నారు.
రైతులు, నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి