
గణేశ్ నవరాత్రోత్సవాలకు పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్‌అర్బన్: గణేశ్ నవరాత్రోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామ ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం పోలీసు అధికా రులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడేలా చూ డాలని, విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకుల కు నిబంధనలు తెలియజేయాలన్నారు. శోభాయా త్ర సమయంలో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చే యాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ టీముల్లో మహిళా పోలీసుల పోలీసులను భాగస్వాముల ను చేయాలన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ రామానుజం, డీసీఆర్‌బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫింగర్ ప్రింట్ డివైస్‌లతో నేర విచారణ వేగవంతం
ఫింగర్ ప్రింట్ డివైస్‌లతో నేర విచారణ, నిందితుల గుర్తింపు వేగవంతమవుతుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఎస్‌హెచ్‌వోలకు ఫింగర్ ప్రింట్ డివైస్‌లు అందించారు. నూతన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.