
ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఆదివారం ఎస్సారెస్పీ నుంచి 50 వేల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల వరద, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మరో 36 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 90 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోఉండడంతో అధికారులు ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి 71 వేల క్యూసెక్కుల నీటిని గోదా వరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం 147.95 మీటర్లు ఉంది. మొత్తం 20.175 టీఎంసీలకు 19.950ల టీఎంసీల నీరు ఉన్న ట్లు అధికారులు పేర్కొన్నారు.