
నిబంధనలు పాటించాల్సిందే.!
చింతలమానెపల్లి/కౌటాల: మరో రెండు రోజుల్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా గణేశ్ ప్రతిమల ను ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీ సుశాఖ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించా లని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని, ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు
ఉత్సవాలు నిర్వహించే కమిటీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. http:// police portel. tspolice.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని వివరాలు తెలపాల్సి ఉంటుంది.
డీజేలు, లక్కీడ్రాలు నిషేధం
గతేడాది గణేశ్ మండపాల వద్ద నిర్వహించిన పలు లక్కీడ్రా, లక్కీ లాటరీలు విమర్శలకు దారి తీశా యి. నిధుల సమీకరణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినా పలుచోట్ల దుర్వినియోగం జరిగింది. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా ఉండాల్సిన గణేశ్ ఉత్సవాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. వీటి ద్వారా వసూలైన నగదు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో పోలీసు శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏరకమైన లక్కీ లా టరీలు నిర్వహించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలి యజేస్తున్నారు. గణేశ్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా డీజేలకు అనుమతిలేదని స్పష్టం చేస్తున్నారు.
నిబంధనలు ఇవే..
1. మండపం ఏర్పాటుకు స్థల యజమాని నుంచి అనుమతి తీసుకోవాలి.
2. విద్యుత్ వినియోగానికి ఆశాఖ అనుమతి తప్పనిసరి.
3. ఎలక్ట్రిసిటీ పనులకు నాణ్యతగల వస్తువులనే వినియోగించాలి. షార్ట్ సర్క్యూట్ జ రగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలి.
4. కమిటీలు, కమిటీ బాధ్యత తీసుకునే వారి వివరాలు, ఫోన్ నంబర్లను పోలీసుస్టేషన్లలో అందజేయాలి.
5. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేయాలి. రహదారులకు అడ్డంగా ఏర్పాటు చేయకూడదు.
6. గణేశ్ ప్రతిమలు ఏర్పాటు చేసే స్టేజ్, వేదికలు సరైన నాణ్యతతో, పటిష్ఠంగా ఉండాలి. వర్షం నుండి రక్షణ కల్పించేలా షెడ్ ఏర్పాటు చేయాలి.
7. మండపం వద్ద 24 గంటలపాటు ఇద్దరు వ్యక్తులు పర్యవేక్షణలో ఉండాలి. రద్దీకి అనుగుణంగా క్యూలైన్లను ఏర్పాటు చే యడంతో పాటు వాలంటీర్లను ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
8. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకా ట ఆడటం, అసభ్య నృత్యాలు చేయకూడదు.
9. విధిగా పాయింట్ పుస్తకాన్ని ఏర్పాటు చేయా లి. పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినపుడు వారికి సహకరించాలి.
10. మండపాలకు సమీపంలో అనుమానా స్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.