
ఆశవర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కాగజ్‌నగర్‌టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వ ర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డి మాండ్ చేశారు. శనివారం పట్టణంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడు తూ కనీస వేతనం రూ.18 వేలు ఇస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నెరవేర్చలేదన్నారు. ఈఎస్‌ఐ, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫి ట్స్ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని, ఆదివారం, పండగ రోజుల్లో సెలవులు అమలు చేయాల ని కోరారు. సమావేశంలో ఆశ వర్కర్స్ యూ నియన్ జిల్లా కార్యదర్శి పద్మ, కాగజ్‌నగర్ పట్టణ అధ్యక్షురాలు భాగ్య, ప్రధాన కార్యదర్శి పంచశీల జరీన, రామజ్యోతి, శకుంతల, వాణి, సురేఖ, తదితరులు పాల్గొన్నారు.