
తల్లిదండ్రులదే బాధ్యత
పిల్లలను మంచి పౌరులుగా పెంచడంలో తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. పిల్లలు ఏడుస్తున్నారని వారికి స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వారు ఏది చూస్తున్నారో అలానే బయట ప్రవర్తిసున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైతే కంటి, నిద్రలేమి, ఒత్తిడి, కోపం, తలనొప్పి, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. బుక్స్ చదవడం, డ్రాయింగ్, ఇన్‌డోర్, అవుట్‌డోర్ గెమ్స్ ఆడించాలి. పార్కులకు తీసుకెళ్తూ వారితో సమయం కేటాయించాలి. పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి ఉంచాలి. పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నా యూట్యూబ్ ఛానల్‌లో చూసి పలు జాగ్రత్తలు పాటించవచ్చు.
– డాక్టర్ ఆర్.కవిత అజయ్, మానసిక వైద్యురాలు, మంచిర్యాల