
దారితప్పుతున్న బాల్యం!
సెల్‌ఫోన్లకు బానిసవుతున్న విద్యార్థులు చిన్నారుల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిఘా కరువు కట్టడి చేయకపోతే ప్రమాదమంటున్న నిపుణులు
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యూకేజీ చదివే ఓ బాలుడు (5) క్లాస్‌రూంలో తోటి బాలిక (5)కు ఐలవ్‌యూ చెప్పాడు. బాలిక విషయాన్ని క్లాస్ టీచర్‌కు చెప్పడంతో అవాకై ్కంది. ఐదేళ్ల బాలుడి ప్రవర్తనఫై పాఠశాల యాజమాన్యం ఆరా తీయగా సెల్‌ఫోన్‌లో యూట్యూబ్ రీల్స్ ప్రభావంతోనే అలా మాట్లాడినట్లు నిర్ధారించుకున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలని సూచించారు.
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు (6) తన తోటి విద్యార్థిని (6)ను క్లాస్ రూంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థినితో పాటు ఉపాధ్యాయురాలు బెంబేలెత్తిపోయారు. ఉపాధ్యాయులు పూర్వాపరాలు ఆరా తీస్తే.. ఫోన్‌లో వీడియో షార్ట్ చూస్తూ ఆ బాలుడు క్రమంగా అలా ప్రవర్తించడం మొదలెట్టినట్లు గుర్తించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను పిల్లలు ఎదిరించి మాట్లాడుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. పిల్ల లు చిన్న వయసు నుంచి పెడదారి పడుతుండడం ఆందోళన కలిగించే అంశం.
కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో గత జనవరిలో ఇంటర్ చదివే నలుగురు యువకులు గొడవపడ్డారు. డయల్ 100కు సమాచారం రావడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి వెళ్లారు. గొడవను ఆపేందుకు ప్రయత్నం చేసిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను ఇద్దరు యువకులు తోసేసి వారి విధులకు ఆటంకం కలిగించారు. సదరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో గాడితప్పుతున్న బాల్యానికి ఈ ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
1–5 ఏళ్ల
చిన్నారులు 35,556
6–17 ఏళ్ల పాఠశాల, కళాశాల విద్యార్థులు 1,11,757
కౌటాల(సిర్పూర్): ప్రస్తుత ఆధునిక కాలంలో పిల్ల లు, మైనర్ విద్యార్థులు పెడదారి పడుతున్నారు. బాల్యంలోనే నేరాల బాట పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం తల్లిదండ్రులనే కాదు పోలీసులనూ ఆందోళనకు గురిచేస్తోంది. పట్టుమని పదేళ్లు కూడా లేని పిల్లలు దారి తప్పుతున్న సంఘటనలూ ఉన్నాయి. సామాజిక పరిణామాలు, కుటుంబ పరి స్థితులు, అందుబాటులోకి వచ్చిన అవసరానికి మి ంచిన సాంకేతిక పరిజ్ఞానం వంటివి బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గంజాయి మత్తులో తూగుతున్న వారిలో నూ చాలా మంది టీనేజీ, అంతకంటే తక్కువ వయ సు వారు ఉంటున్నారు. పోలీసులు వారిని పట్టుకు ని కేసులు పెట్టకుండా కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. ఇక రోడ్లపై ద్విచక్ర వాహనా లతో రాత్రివేళ రయ్యిమంటూ దూసుకెళ్తున్న వారి లోనూ పలువు రు మైనర్లే. ఎవరైనా వీరిని ప్రశ్నిస్తే ఎదురు తిరుగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో యువతులను వేధి స్తున్న వారిలో మైనర్లే ఎక్కువ మంది ఉంటున్నారు.
నిఘా కరువు..
తల్లిదండ్రుల నుంచే పిల్లలు సంస్కారం నేర్చుకోవా లి. దురదృష్టవశాత్తు ఇప్పటి పిల్లలు చాలామంది సెల్‌ఫోన్లకు బందీలై వాటి ద్వారానే అలవాట్లు నేర్చుకుంటున్నారు. పలువురు తల్లిదండ్రులకు కూడా పిల్లలకు మంచీచెడు చెప్పే సమయం ఉండటం లేదు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల డిమాండ్లను రెండో ఆలోచన లేకుండా అంగీకరిస్తుండడంతో వారిని అదుపు చేయడం కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న పిల్లలు దారి తప్పుతున్నారు. పేరెంట్స్ బలహీనతలను గుర్తించడంలో పిల్లలకు ప్రావీణ్యం ఎక్కువ. వారి అభ్యర్థనను అతి గారాబంతో అంగీకరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించాలి. పిల్లల ప్రవర్తను చిన్నప్పటి నుంచే గుర్తించి వారిని దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని పలువురు పేర్కొంటున్నారు. నేటి పిల్ల లే రేపటి పౌరులనే విషయాన్ని తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. పిల్లలు, యువతలో హింసాత్మక ధోరణి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వారిపై నిఘా పెట్టి చెడు అలవాట్లు ఉన్నవారికి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలి. పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ప్రభుత్వం నియంత్రణ తీసుకురావాలని పలువు రు కోరుతున్నారు.
6–17 ఏళ్ల బడి బయట విద్యార్థులు: 3,150
చిన్ననాటి నుంచే...
అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. పిల్లల అల్లరి ఆపడం కోసం చాలా మంది తల్లిదండ్రులు వారిచేతికి స్మార్ట్‌ఫోన్ ఇస్తుంటారు. ప్రారంభంలో ఇది సరదాగా అనిపించినా.. క్రమేపీ అదొక వ్యసనంలా మారుతోంది. పిల్లలు సైతం పెద్దల ప్రమేయం లేకుండానే స్మార్ట్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడుతున్నారు. తమకు కావాల్సిన ఆటలు డౌన్‌లోడ్ పెట్టుకుంటున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో మంచితో పాటు చెడు మిళితమై ఉండడంతో పాటు అతి వినియోగంతో అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ల వాడకం విద్యార్థుల్లో ఎక్కువైంది. పుస్తక పఠనం, క్రీడలకు బదులు స్మార్ట్‌ఫోన్లతో కాలం గడపటం ఎక్కువైంది. చాలా మంది వారికి తెలియకుండానే మానసిక రోగుల్లా మారారు. బాల్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి, పేలవమైన పర్యవేక్షణ యుక్తవయసులో వారు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నాయి. పాఠశాలల్లో నిర్వహించే పేరెంట్స్ మీటింగ్‌కు తల్లిదండ్రులు హాజరు కావాలి. తమ పిల్లల ప్రతిభపై వ్యక్తిగతంగా చర్చించడంతో పాటు వారి అలవాట్లు, వారిలో తీసుకురావాల్సిన మార్పులు, గుణగణాలపై చర్చిస్తారు.
జిల్లా వివరాలు
మొత్తం 1,50,907 మంది పిల్లలు
1–5 ఏళ్లు అంగన్‌వాడీ బయట విద్యార్థులు
444