
లాభాల్లో 40 శాతం వాటా చెల్లించాలి
రెబ్బెన: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 40 శాతం వాటా చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షు డు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు రక్తాన్నే చెమట చుక్కలుగా మార్చి సంస్థను అభివృద్ధిబాటలో నడిపిస్తున్నారని, అలాంటి కార్మికులకు సంస్థ ఆర్జించిన లాభాల్లో నుంచి 40 శాతం వాటా చెల్లించాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసి నాలు గు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు లాభాలు ప్రకటించకపోవడం సరికాదన్నారు. ఓసీపీలు, గనుల్లో ఉత్పత్తి అయ్యే బొగ్గును కోల్ ట్రాన్స్‌పోర్టు కార్మికులు సీహెచ్‌పీలకు తరలించి సంస్థ పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. డ్రైవర్లు, క్లీనర్లు చాలీచాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ట్రాన్స్‌పోర్టు కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం క ల్పించాలని, ప్రతీనెల 10వ తేదీలోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు తిరుపతి, అశోక్, రవి, లచ్చన్న, స్వామి, తదితరులు పాల్గొన్నారు.