
‘సురవరం’ మృతి ఉద్యమాలకు తీరనిలోటు
ఆసిఫాబాద్‌అర్బన్: కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మృతి వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ సీనియర్ నాయకులు బద్రి సత్యనారాయణ అన్నారు. సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్, నాయకులు రాకేష్, తిరుపతి, రంజిత్, శ్రావణ్, ధనుంజయ్, వినీష్, శంకర్, తదితరులు
పాల్గొన్నారు.