
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
కెరమెరి: శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులు, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, జీడీ, చార్జీషీట్లు, కేస్ డైరీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డయల్ 100కు ప్రజల నుంచి వచ్చిన కాల్స్‌కు తక్షణమే స్పందించాలని సూచించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా ఉండాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా నిష్టతో పని చేయాలన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించేలా వ్యవహరించాలన్నారు. గణేశ్ ఉత్సవాల్లో అవసరమైన ప్రదేశాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.