బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
ఆసిఫాబాద్‌అర్బన్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అధికారులు, అంబేడ్కర్ యువజన సంఘాలు, కుల సంఘాల నాయకులతో కలిసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమ కోసం అంబేడ్కర్ తన జీవి తాన్ని త్యాగం చేశారన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబినీ దీక్ష భూమి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అసమానతలు, కుల వివక్ష ఉన్న రోజుల్లోనే అంబేడ్కర్ అత్యున్నత చదువులు చదివి డాక్టరేట్లు పొందారని గుర్తు చేశారు. సమానత్వం, స్వేచ్ఛ. సోదరభావం విలువలు నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. కులాంతర వివాహం చేసుకున్న పలు జంటలకు ఆర్థిక ప్రోత్సాహం కింద ఒక్కొక్కరికి రూ.2.5లక్షల విలువైన బాండ్లు అందజేశారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేడ్కర్ విగ్రహానికి అధికా రులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతిగౌడ్, డీపీఆర్‌వో సంపత్‌కుమార్, విద్యాశాఖ అధికారి ఉదయ్‌బాబు, నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, అజ్మీరా శ్యాంనాయక్, రేగుంట కేశవ్‌రావు, మెంగాజీ, అశోక్, రూప్‌నార్ రమేశ్, ఆత్మారాం, అలీబిన్ అహ్మద్, సత్యనారాయణ పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని అంబేడ్కర్ వి గ్రహానికి ఎమ్మెల్యే హరీశ్‌బాబు నివాళులర్పించారు. డాక్ట ర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రా జ్యాంగంతోనే ప్రస్తుతం భారతదేశం అవిచ్ఛిన్న భూభాగంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.
బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్


