ఏఐ బోధన సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఏఐ బోధన సద్వినియోగం చేసుకోవాలి

Mar 16 2025 12:29 AM | Updated on Mar 16 2025 12:27 AM

రెబ్బెన(ఆసిఫాబాద్‌): కృత్రిమ మేధ(ఆర్టిఫిషియ ల్‌ ఇంటిలిజెన్స్‌)తో కూడిన విద్యా బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని తక్కళ్లపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ విద్యాబోధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులకు బోధనను అందించే కంప్యూటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలి విడతగా చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం 4 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ ల్యాబ్‌లను రాష్ట్ర ప్రభుత్వం, ఏక్‌ స్టెప్‌ ఫౌండేషన్‌ల సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో మరికొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భాష, గణిత సామర్థ్యాల సాధనను పెంపొందించేందుకు ఈ విద్యాబోధన ఎంతగానో దోహదపడుతుందన్నారు. కృత్రిమ మేధస్సును విద్యారంగంలో అమలు చేయడం విప్లవాత్మకమైన ఆలోచన అన్నారు. ప్రాథమిక స్థాయిలో భాష, గణితంలలో అభ్యాసన సామర్‌ాధ్యలతో పాటు కృత్రిమ మేధ సాయంతో ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్లో మెరుగైన సామర్‌ాధ్యలను సాధించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలన్నారు. తక్కళ్లపల్లి పాఠశాలలో మార్పులు తీసుకువచ్చిన ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో శంకరమ్మ, సమన్వయ కర్త శ్రీనివాస్‌, హెచ్‌ఎం మహేశ్వర్‌, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ఏఐతో మరింత నైపుణ్యం

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజన్స్‌)తో విద్యార్థులు మరింత నైపుణ్యం సాధిస్తారని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శనివారం గోయగాం ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ఏఐ విద్యాబోధన కేంద్రాన్ని ప్రారంభించారు. తెలుగు, గణితం, ఆంగ్లంలో ఏఐ బోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులతో పాటు పోషకులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగు, గణితం, ఆంగ్లంలో వెనుకబడిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసేందుకు ఏఐ పద్ధతిని అవలంబిస్తున్నామన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో ప్రతీ పాఠశాలకు చేరుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులకు సద్వినియోగం చేయాలని, ప్రతీరోజు పిల్లలను బడికి పంపించాలని పోషకులను కోరారు. అనంతరం ఝరి ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న పెయింటింగ్‌ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో ఆడే ప్రకాశ్‌, ఝరి హెచ్‌ఎం భరత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఏఐ బోధన సద్వినియోగం చేసుకోవాలి1
1/1

ఏఐ బోధన సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement