రెబ్బెన: వేసవిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల ని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాథోడ్ శేషారావు అన్నా రు. మండలంలోని నంబాల సబ్‌స్టేషన్‌లో కొ త్తగా ఏర్పాటు చేసిన బ్రేకర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు కొత్త బ్రేకర్‌ను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సత్వరమే వాటిని పరిష్కరించి విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. డీఈఈ వీరేశం, ఏడీఈ ఫిరోజ్‌ఖాన్, సంతోష్, ఏఈ ఇమ్రాన్, సిబ్బంది రయీస్, సురేశ్, హరీశ్, సత్తయ్య, నసీరుద్దీన్, మధు పాల్గొన్నారు.