ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని సీపీఎం పార్టీ నాయకులు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని వట్టివాగు, అడ ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టుల్లో నీరున్నా పంటల సాగుకు ఉపయోగపడటం లేదన్నారు. కాలువలకు మరమ్మతులు లేకపోవడం, అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన్న, నాయకులు దినకర్, శ్రీనివాస్, ఆనంద్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.