ఆసిఫాబాద్‌అర్బన్: సమాజంలో నేడు అన్నిరంగాల్లో అతివలే మేటి అని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట ఎస్పీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సిబ్బందితో కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువని, ప్రపంచానికి వెలుగు చూపేది వారేనని కొనియాడారు. పురుషులతో సమానంగా పోటీ పడుతూ విధులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పోలీసుశాఖలోనూ ఉత్తమ ప్రతిభ చూపుతున్నారన్నారు. మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎ స్పీ కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్‌ఐ అడ్మిన్ పెద్దన్న, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీఐ రవీందర్, ఎంటీవో ఆర్‌ఐ అంజన్న, ఎస్సైలు తేజస్విని, సౌమ్య, తిరుమల, శిరీష, భరో సా కేంద్రం, షీటీం, ఐటీకోర్, డీసీఆర్‌బీ, సఖి కేంద్రం సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.