
భీం ఆశయ సాధనకు కృషి
కౌటాల: కుమురంభీం ఆశయ సాధనకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, కుమురంభీం మనవడు కుమురం సోనేరావు సూచించారు. మండలంలోని తాటిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘జల్ జంగల్ జమీ న్’ కోసం పోరాడిన గొప్ప యోధుడు కుమురంభీం అని కొనియాడారు. కుమురంభీం పోరాట స్ఫూర్తి తోనే ఆదివాసీలు తమ హక్కులను కాపాడుకోవాల ని సూచించారు. ఆదివాసీలు ఆర్థికంగా, సామాజి కంగా, రాజకీయంగా వృద్ధి చెందాలని పిలుపుని చ్చారు. అనంతరం కుమురంభీం విగ్రహం వద్ద ఆదివాసీ నాయకులు జెండాలు ఎగురవేశారు. విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. గ్రా మంలో భాజాభజంత్రీలతో ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, ఎంపీటీసీ సభ్యులు గావుడే వనిత, నాయకులు నైతం సీతల్, ఆనంద్‌రావు, విఠల్ తదితరులు పాల్గొన్నారు.