మత్తు పదార్థాల నియంత్రణపై దృష్టి సారించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా పోలీస్‌ అధికారులు
 - Sakshi

ఆసిఫాబాద్‌అర్బన్‌: మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ అంజనీకుమార్‌ అన్నారు. మంగళవారం ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడు తూ శాంతి భద్రతల విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యహరించాలన్నారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కారించాలన్నారు. కేసుల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంతోపాటు క్షేత్ర స్థాయిలో సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులను ఎస్పీ సురేశ్‌ కుమార్‌ డీజీపీకి వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ(ఏఆర్‌) భీమ్‌రావు, కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఐటీ కోర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీజీపీ అంజనీకుమార్‌

Read latest Komaram Bheem News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top