నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా.. | - | Sakshi
Sakshi News home page

నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా..

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

కొణిజర్ల: పని ముగించుకుని కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో ఓ పెయింటర్‌ మృతి చెందాడు. మండలంలోని పెద్దగోపతికి చెందిన కొమ్ము శివకృష్ణ(35) ఖమ్మంలో పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమాన ఖమ్మలో పని ముగిశాక బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై పెద్దగోపతి వెళ్తుండగా చిన్నగోపతి శివారు మూల మలుపులో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వాహనం స్కిడ్‌ కావడంతో ఆయన రోడ్డుపై పడ్డాడు. ఈక్రమాన తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో ఖమ్మం తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా, శివకృష్ణకు భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉండగా, ప్రస్తుతం భార్య ఎనిమిది నెలల గర్భిణి. శివకృష్ణ మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా.. ఘటనపై ఆయన కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూరజ్‌ తెలిపారు.

బైక్‌ పైనుంచి జారి పడి పెయింటర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement