కచ్చితత్వంతో జనగణన
● మాతాశివు మరణాలు సున్నాకు చేరేలా కృషి చేయాలి ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మంవైద్యవిభాగం: సురక్షితమైన ప్రసవాలతో తల్లులు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఆరోగ్యవంతమైన కుటుంబం, బలమైన సమాజానికి పునాది పడుతుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లి ఆరోగ్యం కుటుంబానికే కాక సమాజ ఆరో గ్య స్థితిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మాతా – శిశు మరణాల తగ్గింపులో మంచి ఫలితాలు వస్తున్నా, మరింత మెరుగుదల అవసరమన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది దృష్టి సారించాలని సూ చించారు. ప్రతి గర్భిణీ పేరును తొలి దశలోనే నమోదు చేసి, క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తే ప్రసవ సమయాన ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ప్రసవానికి ప్రభు త్వ ఆస్పత్రులకే వచ్చేలా అవగాహన కల్పించడంతో పాటు బిడ్డ పుట్టాక తల్లిపాల ఆవశ్యకతను వివరించాలని చెప్పారు. డీఎంహెచ్‌ఓ రామారావు, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ చందునాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుమాధవరావు, ప్రోగ్రాం అధికారి బిందుశ్రీ, వైద్యులు యామిని, ఎండీ సోహైల్, చేతన్, షమా ఫిర్దౌస్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోగా యంగ్ ఇండియా
గురుకుల నిర్మాణం
ఖమ్మంరూరల్: పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసేలా యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. రూరల్ మండలం పొన్నేకల్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించి మాట్లాడారు. ప్రధాన భవన నిర్మాణంతో పాటు లింక్, అంతర్గత రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పనులు పూర్తిచేసి పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనుల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు నివేదికల రూపొంలో అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ ఈఈ బుగ్గయ్య, తహసీల్దార్ వినయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో జనగణన అత్యంత పకడ్బందీగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. తొలుత గృహ సముదాయాల బ్లాక్ లను గుర్తించి సీఎంఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జనగణన, పీఎన్జీ గ్యాస్ పైప్‌లైన్, ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో తప్పక పరిశీలించి నమోదు చేయాలని తెలిపారు. మే 10న ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా, ప్రతీ 300 ఇళ్లు లేదా 800 జనాభాను ఒక బ్లాక్‌గా గుర్తించాలని చెప్పారు. ఆ తర్వాత గ్యాస్ పైపులైన్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు అనుమతి తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఆ తర్వాత ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వసతుల కల్పనపై సూచనలు చేశారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, డీసీఓ గంగాధర్, డీసీఎస్‌ఓ చందన్‌కుమార్, సీపీఓ ఏ.శ్రీనివాస్, డీపీఓ రాంబాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, డీఎంఏ ఎం.ఏ.అలీం, మార్క్‌ఫెడ్ మేనేజర్ శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు.


