సుజాతనగర్ మండలం
సింగభూపాలెం చెరువులో
బుధవారం నుంచి చేపల
విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడి చేపలు రుచిగా ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. చెరువుపై
ఆధారపడి సుమారు 400 మత్స్యకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నెల పాటు చేపల వేట కొనసాగనుండగా, తొలిరోజు బొచ్చ, రవ్వ రకం
చేపలు కిలో రూ.140 చొప్పున, పాంప్లెట్లు కిలో రూ.100 చొప్పున విక్రయించారు. – సుజాతనగర్


