ఖమ్మంవైద్యవిభాగం: నాణ్యమైన ఆహారం తీసుకుంటేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం ‘ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వద్ద అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఆహార భద్రత ప్రమాణాలపై ప్రజలకేకాక వ్యాపారుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించకపోతే భవిష్యత్‌లో దుష్ప్రభావాలు ఎదురవుతాయని చెప్పారు. ఈమేరకు సంబంధిత శాఖ అధికారులు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ర్యాలీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కొనసాగగా.. ఆహార భద్రత ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. డీఎంహెచ్‌ఓ రామారావు, జిల్లా ఆస్పత్రుల కోఆర్డినేటర్ రాజశేఖర్‌గౌడ్, డీవైఎస్‌ఓ సునీల్ రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్, ఉద్యోఉలు జడ్.ఎస్.జయపాల్, బిట్టా ప్రవీణ్‌కుమార్ తదితరులు అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


