ఖమ్మంమయూరిసెంటర్: అమరుల త్యాగాలు, కార్మికుల పోరాటాలతో సాధించుకున్న చట్టాలను తుంగలో తొక్కడమే కాక పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ, బీఆర్‌టీయూ రాష్ట్ర, జిల్లా నాయకులు కొత్త సీతారాములు, సింగు నరసింహారావు, విష్ణువర్ధన్, జి.రామయ్య, సాదినేని వెంకటేశ్వరరావు, పాషా మాట్లాడుతూ ప్రధాని మోదీ అవలంబిస్తున్న కార్మికవర్గ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు నారల నరేష్‌నాయుడు, గాదె లక్ష్మీనారాయణ, నవీన్‌రెడ్డి, కె.శ్రీనివాస్, సుభాహన్, పాల్వంచ కృష్ణ, సిద్ధల నాగేష్, ఫజల్, రామకృష్ణ, దొంగల తిరుపతిరావు, రామదాసు, పట్ట రవి, సైదులు, సీ.వై.పుల్లయ్య, ఆవుల అశోక్, లెనిన్, సత్తార్‌మియా, స్వామి తదితరులు పాల్గొన్నారు.
నల్ల జెండాలతో
కార్మిక సంఘాల నిరసన


