ఖమ్మంగాంధీచౌక్: భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1,030కోట్ల టర్నోవర్ సాధించిందని చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి తెలిపారు. ఖమ్మంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 29ఏళ్లుగా స్థిరమైన అభివృద్ధి సాధిస్తూ ఏటా వాటా దారులకు 18శాతం డివిడెండ్ చెల్లిస్తున్నామని తెలి పారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 25 బ్రాంచ్‌లతో విస్తరణకు వాటాదారులు, ఖాతాదారులు, సిబ్బంది సహకారమే కారణమని వెల్లడించారు. ఈ సందర్భంగా గత డైరెక్టర్లు, వ్యవస్థాపక డైరెక్టర్లు గుర్రం ఉమాహేశ్వరరావు, రేఖల భాస్కర్, మద్ది బాబు, అర్వపల్లి నిరంజన్‌ను సన్మానించారు. వైస్ చైర్మన్లు సన్నె ఉదయ్ ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు దేవత రాజారావు, మద్ది పిచ్చయ్య, కపిలవాయి జయప్రద, రాజా పురోహిత్ చైన్ సింగ్, రంగనాగ శ్రీనివాస్, దారా జీవన్, సీఈఓ దాసరి వేణుగోపాల్‌తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.


