పుణ్యక్షేత్రాల సందర్శనలో రోడ్డుప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాల సందర్శనలో రోడ్డుప్రమాదం

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

ప్రయాగలో వైరా వాసి మృతి

వైరా: పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన వైరావాసి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వైరాకు చెందిన బండారు తిరుపతిరావు(58) మరో 60మందితో కలిసి గత నెల 28న ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు రైలులో వెళ్లాడు. అక్కడ వీరంతా బృందాలుగా విడిపోయి వాహనా ల్లో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈక్రమాన తిరుపతిరావు, పలువురు శనివారం ప్రయాగలో దర్శనం అనంతరం వెళ్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురవడంతో తిరుపతిరావుకు తీవ్రగాయాలు, మిగతా కొందరికి స్వల్ఫగాయాలయ్యాయి. ఈమేరకు చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందగా అంబులెన్స్‌లో మృతదేహాన్ని బుధవారం ఇక్కడకు తీసుకొచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, తిరుపతిరావు మృతిపై వైరామాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, వైస్‌ చైర్మన్‌ కట్ల సంతోష్‌, కౌన్సిలర్‌ బొర్రా ఉమాదేవి, మార్కెట్‌ చైర్మన్‌ బోళ్ల రంగారావు, నాయకులు డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, దార్న రాజశేఖర్‌, వేముల రత్నాకర్‌, మోర్‌ శ్రీకాంత్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

బిడ్డ పుట్టిన ఆనందం తీరకుండానే..

కొణిజర్ల: కుమార్తెను పుట్టిందన్న ఆనందంతో భార్యాబిడ్డను తీసుకెళ్దామని వచ్చిన వ్యక్తి రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఆయన వెళ్తున్న ఆటో వేగం కారణంగా అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరి గింది. ఘటనకు సంబంధించి వివరాలు... హైదరాబాద్‌కు చెందిన నంబి ఫణిధర్‌(31) హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపాన ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన పెద్దగోపతికి చెందిన యువతి రేణుకను వివాహం చేసుకోగా, మూడు నెలల క్రితం ఆమె కుమార్తెకు జన్మనిచ్చింది. దీంతో రెండు రోజుల క్రితం పెద్దగోపతి వచ్చిన ఫణిధర్‌ భార్యాకుమార్తెను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఫణిధర్‌ – రేణుక దంపతులతోపాటు ఆయన బావమరిది జయసాయిరామ్‌, తదితరులు ఆటోలో పెద్దగోపతి నుంచి ఖమ్మం వెళ్తుండగా తనికెళ్ల సమీ పాన ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఫణిధర్‌ రోడ్డు పక్కన పడిపోగా ఆయన తలకు రాయి తాకడంతో తీవ్ర గాయమైంది. ఆయనను 108లో ఖమ్మం తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జయసాయిరామ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.సూరజ్‌ తెలిపారు.

గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం

ఖమ్మంక్రైం: గృహా అవసరాలకు వాడే గ్యాస్‌ సిలిండర్లను హాటళ్లలో వినియోగిస్తుండగా ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌, టూటౌన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు బుధవారం చేపట్టిన తనిఖీల్లో నెహ్రూనగర్‌లోని చక్క వెంకట్‌ ఫణీంద్రబాబు హాటల్‌ నుంచి నాలుగు, కొనికి చంద్రశేఖర్‌కు చెందిన ఉడిపి ఆరాధ్య టిఫిన్‌ సెంటర్‌ నుంచి నాలుగు సిలిండర్లు స్వాధీనం చేసుకుని బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

రోడ్డుప్రమాదంలో హైదరాబాద్‌ వాసి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement