ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడడమే తమ లక్ష్యమని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించేలా చేపట్టిన ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఖమ్మం టూటౌన్‌లో ప్రారంభించి మాట్లాడారు. పాలక వర్గాలు ప్రజలను విస్మరించి పాలన సాగిస్తుండడమే కాక వసతుల కల్పనలో విఫలమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా, నగర కార్యదర్శులు కార్యదర్శి దండి సురేష్‌, ఎస్‌.కే.జానీమియా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, మహ్మద్‌ సలాం, పోటు కళావతి, పగడాల మల్లేష్‌, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, గాదె లక్ష్మీనారాయణ, ఎస్‌కే.సైదా, వరదా నర్సింహారావు, జ్వాలా నర్సింహారావు, మందా వెంకటేశ్వర్లు, మాడుగుల నాగేశ్వరరావు, చానా తదితరులు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతం, విస్తరణ

సీపీఐ విస్తరణ, బలోపేతమే లక్ష్యంగా శ్రేణులు ముందుకు సాగాలని హేమంతరావు పిలుపునిచ్చా రు. ఖమ్మం గిరిప్రసాద్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్మాణానికి గాను అన్ని డివిజన్లలో సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే, పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ ఈనెల 15 నాటికి పూర్తి చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, జానీమియా, పోటు కళావతి, పగడాల మల్లేష్‌, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివరెడ్డి, ఏనుగు గాంధీ, వరదా నర్సింహారావు పాల్గొన్నారు.

‘ఇంటింటికీ సీపీఐ’ని ప్రారంభించిన బాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement