చింతకాని: వుండలంలోని నేరడలో వరద కాలువ బుధవారం సాగర్ జలాలతో నిండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేరడ రెవెన్యూ పరిధి నల్లకుంట, ఊడుగులకుంట చెరువులను అనుసంధానించడంతో పాటు వర్షాకాలంలో పొలాల్లోని నీటిని మళ్లించేందుకు ఎన్నో క్రితం వరద కాలువను నిర్మించారు. ఇప్పుడు ఆ కాలువ సాగర్ జలాలలో కళకళలాడుతోంది. జనవరి వస్తే పశువులు తాగేందుకు సైతం నీరు ఉండని నల్లకుంట, ఊడుగులకుంట చెరువులు కూడా నిండుకుండల్లా మారాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చొరవతో నిర్మించిన కొదుమూరు – వందనం ఎత్తిపోతల పథకంతోనే ఇది సాధ్యమైందని రైతులు వెల్లడించారు.


