ఖమ్మంమయూరిసెంటర్: 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం నగర పాలక సంస్థకు ఆస్తి పన్నుల ద్వారా రూ.37.40 కోట్ల ఆదాయం సమకూరింది. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒకేరోజు రూ.2.35 కోట్ల పన్నులు వసూలు చేశారు. గతేడాది రూ.34.97 కోట్లు వసూలు చేయగా.. ఈసారి రూ.37.40 కోట్లు ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు. కాగా, లక్ష్యం మేర ఆస్తి పన్నులు వసూలు చేసే మున్సిపల్, కార్పొరేషన్లకు ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయనుండగా, కేఎంసీ అర్హత సాధించిందని తెలిపారు.
హిమాలయాలపై
వైఎస్సార్‌సీపీ జెండా
ఖమ్మంమయూరిసెంటర్: హిమాలయ పర్వత శిఖరాలపైకి వెళ్లిన వైఎస్సార్ కుటుంబ అభిమా ని అక్కడ వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశారు. బోనకల్ మండలం రావినూతల గ్రామానికి చెందిన గణపారపు మురళి ముదిరాజ్ మార్చి 29న హిమాలయ పర్వతం అధిరోహించారు. ఆ సమయాన తనతో పాటు ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో కూడిన వైఎస్సార్‌సీపీ జెండాను తీసుకెళ్లి ఎగురవేయడం ద్వారా అభిమానాన్ని చాటుకున్నారు.
నేటి నుంచి
అగ్నివీర్‌కు దరఖాస్తులు
ఖమ్మంరాపర్తినగర్: భారత సైన్యంలో చేరేందుకు అగ్నివీర్‌లో భాగంగా ఈ నెల 1 నుంచి జూలై 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. వివాహం కాని పురుషులు, కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం www. joinindianaarmy. nic. in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని ఆయన సూచించారు.
ఉద్యోగ విరమణ చేసిన పోలీసులకు సన్మానం
ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సన్మానించారు. ఖమ్మంలోనిసీపీ కార్యాలయంలో సోమ వారం వారిని సన్మానించాక ఆయన మాట్లాడారు. సుదీర్ఘ కాలం వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన వారు శాఖకు ఎనలేని సేవలందించారారని కొనియాడారు. ఏఆర్ ఏసీపీ నర్స య్య, ఆర్‌ఐలు కామరాజు, సురేశ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, హోంగార్డుల అసోసియేషన్ అధ్యక్షుడు బంకా శ్రీను, కంపెనీ కమాండర్లు వెంకటేశ్వర్లు, డి.రమేశ్, డి.రవి, ఈజీ నాగరాజు, నాగరాజుతో పాటు ఉద్యోగ విరమణ చేసిన కె.కోడెత్రాచు, ఎస్‌కే మదార్, జి.భీమా, బి.పుల్లారావు, వీవీ చార్యు లు, బి.హరిబాబు, వి.బాబురెడ్డి, వై.జాన్ పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో పూజారి మృతి
పెనుబల్లి: మండలంలోని వీఎం బంజరలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పాత కారాయిగూడెంకు చెందిన ఉప్పలమ్మ పూజారి నరకుల్ల నాగేశ్వరరావు(60) కాలినడక వెళ్తూ వీఎం బంజరలోని సోమ్లానాయ క్ తండా వద్ద రోడ్డు దాటుతుండగా ఖమ్మం వైపు నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, ఆ తర్వాత ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయన సోమ్లానాయక్ తండాలో ఉప్పలమ్మ పూజ నిర్వహించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. కేసు నమోదు చేసినట్లు వీఎంబంజర్ ఎస్‌ఐ కె.వెంకటేశ్ తెలిపారు.


